నాని కోసం వేణు రివెంజ్ డ్రామా

టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో దిట్ట నేచురల్ స్టార్ నాని. డైరెక్టర్ కొత్త, పాత అనేది చూడకుండా కంటెంట్ నచ్చితే చాలు వెంటనే సినిమాకి కమిట్ అయిపోతాడు. ఈకోవలోనే ‘బలగం’ ఫేమ్ వేణు తో సినిమాకి ఓ.కె. చెప్పాడు. అంతకుముందు నటుడిగా పరిచయమున్న వేణు ‘బలగం’తో దర్శకుడిగా అగ్రపథానికి దూసుకెళ్లాడు. చాలా తక్కువ బడ్జెట్ లో సహజత్వానికి పెద్ద పీట వేస్తూ వేణు తెరకెక్కించిన ‘బలగం’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయంగానూ అవార్డుల వర్షం కురిపించింది.

‘బలగం’ తరహాలోనే నానితో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా చేయబోతున్నాడట వేణు. అయితే.. ఈసారి రివెంజ్ ఎలిమెంట్ ను తీసుకున్నాడట. ఆద్యంతం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాగా నాని కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ‘హాయ్ నాన్న’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నాని.. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నానికి ‘అంటే.. సుందరానికి’ వంటి వైవిధ్యభరిత చిత్రాన్నందించిన వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత సుజీత్ డైరెక్షన్ లో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాతే వేణుతో మూవీ పట్టాలెక్కనుందట.

Related Posts