‘దేవర’ యాక్షన్ కంప్లీట్.. సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది? షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? ఎందుకు ‘దేవర’ వాయిదా పడింది? అనే విషయాలు తారక్ ఫ్యాన్స్ ను తికమక పెడుతున్నాయి. ఇప్పటివరకూ ‘దేవర పార్ట్ 1’ పోస్ట్ పోన్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినా.. వేసవి కానుకగా ఏప్రిల్ లో అయితే సినిమా రావడం లేదు. ఇక.. ‘దేవర 1’ షూటింగ్ ప్రోగ్రెస్ కి సంబంధించి ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ యాక్షన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిందట. కొంచెం టాకీ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.

ఈ సినిమాలోని యాక్షన్ ను హాలీవుడ్ స్టైల్ లో తీర్చిదిద్దాడట డైరెక్టర్ కొరటాల శివ. ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ‘దేవర’.. యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది అంటే.. మొత్తంగా సినిమా పూర్తయినట్టే. పాటల విషయానికొస్తే ఒక సాంగ్ మాంటేజెస్ ను చిత్రీకరించారట. అయితే.. నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఆమధ్య సంగీత దర్శకుడు అనిరుధ్ అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వడంలేదనే టాక్ వినిపించింది. అందుకోసమే పాటల చిత్రీకరణ ఆలస్యమవుతోందా? అనే సందేహాలూ మొదలయ్యాయి. ఏదేమైనా.. త్వరలోనే ‘దేవర’ బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి.. కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయడానికి సంసిద్ధమవుతోందట టీమ్.

Related Posts