‘గామి’ షూటింగ్ అంతా ఓ సాహసయాత్ర : చాందిని చౌదరి

విశ్వక్‌సేన్‌, చాందిని చౌదరి, అభినయ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు మెయిన్‌ లీడ్ చేస్తున్న మూవీ ‘గామి’. డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుందనేది టీజర్‌ , ట్రైలర్ ల ద్వారా హింట్ ఇచ్చారు. దాదాపు ఆరేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ చాందినీ చౌదరి మీడియాతో ముచ్చటించారు.


గామి ప్రాజెక్ట్ లో మొదటి రోజు నుంచి వున్నాను. మను సినిమా చేసినపుడు దర్శకుడు విద్యాధర్ గారు పరిచమయ్యారు. గామి అంటే సీకర్.. తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు గామి. వారణాసి, కుంభమేళ, కాశ్మీర్, హిమాళయాలు.. ఇలా రియల్ లోకేషన్స్ లో ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరీంచాం. మా టీంలో నేను ఒక్కరే అమ్మాయిని. అందరం ఒక బస్ లో వెళ్లి సూర్యస్తమయం వరకూ షూటింగ్ చేసి వచ్చే వాళ్ళం. షూటింగ్ లో చాలా సవాల్ తో కూడిన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వలన నీరు కూడా తాగేదాన్ని కాదు. దాదాపు నెల పాటు ఇలా షూటింగ్ చేశాం. ఇందులో చూపించిన స్టంట్స్ రియల్ గా చేశాం. గడ్డకట్టిన మంచు పొరల మీద నడిచినప్పుడు పగుళ్ళు వచ్చాయి. పొరపాటున కిందపడితే ప్రాణానికే ముప్పు. అలాంటి సమయంలో నా దగ్గర ఉన్న లగేజ్ ని పారేసి జంప్ చేసి లక్కీగా బయటపడ్డాను. ఈ సినిమా ప్రయాణం అంతా ఒక సాహస యాత్రలా జరిగిందని గుర్తు చేసారు.


కమర్షియల్ సినిమాలు చేయొచ్చు. నేను చేశాను కూడా. అయితే సినిమా పరిశ్రమలోకి వచ్చిందే ఒక పాషన్ తో. కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియత్రించుకోలేను. ‘గామి’ కథ విన్నప్పుడు కూడా ఖచ్చితంగా అందులో భాగం కావాలనిపించిందన్నారు.


ఐమాక్స్ స్క్రీన్ లో ట్రైలర్ చూసినప్పుడు పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయన్నారు. దర్శకుడు విద్యాధర్ క్రాఫ్ట్ మీద చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తను అనుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తాడు. చాలా డిఫరెంట్ వాతావరణ పరిస్థితిలలో తీసిన సినిమా అన్నారు. ఈ మూవీ షూట్‌కి ఎక్కువ టైమ్‌ పడుతుందని అప్పుడే తెలుసన్నారు.


ఇందులో నాది, విశ్వక్ పాత్రల కథలు ఒకదానితో ఒకటి మెర్జ్ అయ్యే వుంటాయి. ఎలా మర్జ్ అవుతాయనే తెరపై చూడాలన్నారు. పరిశ్రమలో పదేళ్ళు పూర్తి చేసుకోవడం నిజంగా అన్ బిలివబుల్. పరిశ్రమలోకి వచ్చినపుడు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు చాందిని. అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. నాకు ఇబ్బందిగా అనిపించని పాత్రలు చేస్తానన్నారు.
అప్‌కమింగ్ మూవీస్‌ గురించి చెప్తూ.. నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. నిర్మాతలు వివరాలని తెలియజేస్తారు. అలాగే ఝాన్సీ వెబ్ సిరిస్ మరో సీజన్ కూడా రాబోతుందన్నారు.

Related Posts