భీమాలో అఘోరాలను అందుకే పెట్టాం : కెకె రాధామోహన్‌

భీమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ మూవీని ఎ.హర్ష డైరెక్షన్‌లో కెకె రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 8 న గ్రాండ్ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్‌ మీడియాతో ముచ్చటించారు.


గోపీచంద్ గారు ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్. చాలా కొత్త జోనర్ లో వుండే కథ ఇది. ఈ జోనర్ గోపి గారు గతంలో చేయలేదు. ప్రస్తుతం ప్రేక్షకుల ఇలాంటి కథలని గొప్పగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టామన్నారు. దర్శకుడు చెప్పిన కథ సహనిర్మాత శ్రీధర్‌ గారు విని గోపీచంద్‌ గారికి వినిపించడంతో నచ్చి.. తన పేరు సజెస్ట్ చేసినట్టుగా చెప్పారు రాధామోహన్‌.


భీమాలో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామి పరిసరప్రాంతాల్లో వుంటుంది. అక్కడ జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్ కోసం చూపించాం. అఘోరాలకు కథతో సంబంధం లేదు. కథ, జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ అన్నారు. అఖండ కి భీమాకు పోలిక ఉందన్న రూమర్‌ను కొట్టిపారేశారు నిర్మాత రాధామోహన్‌.దర్శకుడు గురించి చెప్తూ.. హర్ష చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తను కొరియోగ్రఫర్ కూడా. మా బెంగాల్ టైగర్ సినిమాకి చేశారు. భీమాని చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారన్నారు.


ఈ సినిమా ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్ , మంగుళూరు, బాదామి, ఇలా చాలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. అన్నపూర్ణలో ఒక భారీ టెంపుల్ సెట్ ని క్రియేట్ చేశాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీపడకుండా తీశాం. మేము అనుకున్న క్యాలిటీ ఇవ్వగాలిగాం. దాని కారణంగా బడ్జెట్ పెరిగింది. భీమా బిజినెస్ పరంగా హ్యాపీగా వున్నామన్నారు.


ట్రైలర్ లో చూపించినట్లుగా ఇందులో గోపిచంద్ గారిది బ్రహ్మరాక్షుడి క్యారెక్టరైజేషన్ గానే వుంటుంది. అయితే కథలో సిట్యువేషనల్ కామెడీ వుంటుందన్నారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ పాత్రలు డిఫరెంట్ గా వుంటాయి. పోలీస్ క్యారెక్టర్, మాళవిక శర్మ పాత్రల మధ్య ఓ ప్రేమకథ వుంటుంది. ప్రియా భవానీ శంకర్ ది పూర్తిగా భీనమైన పాత్ర. అది ఇప్పుడే రివిల్ చేయకూడదన్నారు. భీమాలో వీఎఫ్ఎక్స్ కి చాలా ప్రాధాన్యత వుంది. ఎక్కడా రాజీపడకుండా చేశామన్నారు.రవి బస్రూర్ కేజీఎఫ్ సలార్ చేశారు. హర్ష కి రవి బస్రూర్ కి ముందే పరిచయం వుంది. ఈ సినిమాకి రవి బస్రూర్ అయితే బావుంటుందని అనుకున్నాం. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారన్నారు.


కొత్త సినిమాలు గురించి చెప్తూ.. అయుష్ శర్మ హీరోగా ఒక హిందీ సినిమా జరుగుతోంది. ఏప్రిల్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో వుంది.

Related Posts