విజయ్ ఎలివేషన్స్ తో ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్

‘లైగర్’తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. లాస్ట్ ఇయర్ ‘ఖుషి’ మూవీతో డీసెండ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’తో పూర్తిస్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ‘గీత గోవింతం’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ‘ఫ్యామిలీ స్టార్’పై అంచనాలను పెంచేసింది.

లేటెస్ట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి మోస్ట్ అవైటింగ్ టీజర్ వచ్చేసింది. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఫ్యామిలీకి అతనిచ్చే ఇంపార్టెన్స్.. అతని బడ్జెట్ లెక్కల ముందు ఎవరైనా దిగదుడుపే.. ఈ సినిమా టీజర్ ను బట్టి ‘ఫ్యామిలీ స్టార్’లోని విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ ను ఈ విధంగా అంచనావేయొచ్చు. ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ లోనే ఇదొక ఫక్తు ఫ్యామిలీ మూవీ అని అర్థమవుతోంది. ఇక.. టీజర్ లో ‘దేఖోరే దేఖో.. కలియుగ రాముడు అచ్చిండు కాకో’ అంటూ విజయ్ కి ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ .. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ గురించి చెప్పకనే చెబుతున్నాయి. ఓవరాల్ గా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా ‘ఫ్యామిలీ స్టార్’ రాబోతుంది.

టీజర్ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు.. కీలక పాత్రలు పోషిస్తున్న అభినయ, వాసుకి వంటి వారు కూడా సందడి చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలకు ముస్తాబవుతోంది

Related Posts