HomeLatestబోయపాటి ‘అఖండ 2‘ పైనే ఆసక్తి చూపిస్తున్నాడా?

బోయపాటి ‘అఖండ 2‘ పైనే ఆసక్తి చూపిస్తున్నాడా?

-

‘స్కంద‘ తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు? అనేదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాని నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే.. ఈ క్రేజీ కాంబోలో హీరో ఎవరనేది ప్రకటించలేదు. ‘సరైనోడు‘ తర్వాత బోయపాటి, గీతా ఆర్ట్స్ కలయికలో రూపొందబోయే సినిమాలో అల్లు అర్జున్ లేదా సూర్యలలో ఒకరు హీరోగా నటించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది.

గీతా ఆర్ట్స్ మూవీని పక్కనపెడితే.. బోయపాటి దగ్గర ‘అఖండ 2‘కి సంబంధించి కథ కూడా సిద్ధంగానే ఉందట. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ‘ అఖండమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ సీక్వెల్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. స్టోరీ రెడీగా ఉంది కాబట్టి.. బోయపాటి శ్రీను ముందుగా ‘అఖండ 2‘ని స్టార్ట్ చేస్తాడా? లేక గీతా ఆర్ట్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అనేది వేచి చూడాలి.

ఇవీ చదవండి

English News