భైరవకోన తో రియల్‌ గానే కనెక్ట్‌ అయ్యాను : హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ

ఊరిపేరు భైరవకోన.. ఫస్ట్‌లుక్‌ నుంచి ట్రైలర్ వరకు ప్రతీ ప్రమోషనల్‌ వీడియోతో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మూవీ. డిఫరెంట్ చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్‌ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, నూపుర్‌ సనన్ మెయిన్ లీడ్ చేసారు. ఫిబ్రవరి 16 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ కాబోతున్న సందర్భంగా చిత్ర హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఈ చిత్ర విశేషాలు మీడియాతో పంచుకున్నారు.


స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మేలోడీస్ చిత్రాల్లో గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో కనిపించాను. ఇందులో మాత్రం గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ పాత్ర అనాలి అన్నారు వర్ష బొల్లమ్మ. ట్రైలర్ లో చూస్తే నాకు ఒక యాక్షన్ సీన్ వుంటుంది. భూమి పాత్రలో చాలా స్ట్రెంత్, పవర్ వుందన్నారు. నేను హిల్‌ స్టేషన్‌ అయిన కూర్గ్‌ నుంచి వచ్చాను కాబట్టి నిజజీవితంలోనూ మేము చెట్లు , నదులు, కొండలను ఆరాధిస్తాం.. అలా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యానన్నారు వర్ష.


సందీప్‌ కిషన్‌ తో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్‌.అందరికీ బాగా రెస్పెక్ట్ ఇస్తారన్నారు. గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్ అంటూ కితాబిచ్చారామె.


‘ఊరు పేరు భైరవకోన’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. ప్రేక్షకుడు ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. అద్భుతమైన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇందులో చాలా మంచి సందేశం కూడా వుందన్నారు.


తన అప్‌కమింగ్ మూవీస్‌ గురించి చెప్తూ… ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని గురించి నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు. తెలుగు తమిళ్ మలయాళంలో చిత్రాలు చేశాను. త్వరలో కన్నడలో కూడా చేసే అవకాశం వుందన్నారు.

Related Posts