రామ్.. కొడితే కుంభస్థలం..లేదంటే.. ?

కుంభస్థలం ఎనర్జిటిక్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్. కానీ ఆ క్రేజ్ తగ్గ విజయాలు అతని ఖాతాలో లేవు. బిగ్గెస్ట్ హిట్స్ అన దగ్గ చిత్రాలు చాలా తక్కువ. ఉన్నంతలో ఇస్మార్ట్ శంకర్ ఒక్కటే చెప్పుకోదగ్గది. ఎప్పుడూ ఫ్లాప్స్.. ఎప్పుడో ఒక హిట్ అంటూ సాగుతోన్న రామ్ కెరీర్ లో ది వారియర్ ఓ బిగ్గెస్ట్ టెస్ట్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్ ఫ్లాప్ అయింది. అయినా తన కెరీర్ లోనే మార్కెట్ కు మించిన బడ్జెట్ తో రూపొందిన సినిమా ది వారియర్. పైగా ఈ చిత్రానికి తమిళ్ లో పూర్తిగా మార్కెట్ కోల్పోయిన లింగుస్వామి దర్శకుడు. ఒకప్పుడు అక్కడ టాప్ డైరెక్టర్ అనిపించుకున్న లింగుస్వామి.. తర్వాత వరుస ఫ్లాప్ లతో కెరీర్ చివరి దశకు వెళ్లినంత పనిచేసుకున్నాడు. కోలీవుడ్ లో ఏ స్టార్ హీరో పట్టించుకోకపోతే కొన్నాళ్లుగా టాలీవుడ్ లోనే మకాం వేశాడు. ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలాకాలం ట్రావెల్ చేశాడు. వర్కవుట్ కాలేదు. దీంతో తన కథలోని వెయిట్ ఏ మాత్రం మ్యాచింగ్ ఇమేజ్ లేని రామ్ దగ్గర ఆగాడు. మ్యాచింగ్ లేదు అని ఎందుకన్నాం అంటే.. ట్రైలర్ లో ఉన్న మాసివ్ నెస్.. ఆ పవర్.. ఇప్పటి వరకూ రామ్ చేసిన సినిమాల్లో లేదు. పైగా అతని కటౌట్ కూడా అంత పెద్దదేం కాదు. అయినా ఇంత బడ్జెట్ తో వస్తున్నారంటే ఖచ్చితంగా కథలో దమ్ముందనే అనుకోవాలి.

కథలో దమ్ముంది.. భారీ బడ్జెట్ తో సినిమా చేశారు. మరి దాన్ని రికవర్ చేయడం ఎలా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ మూవీ పోతే లింగుస్వామికి ఎంత నష్టమో రామ్ కూ అంతే నష్టం. అందుకే ఈ వారియర్ రామ్ కెపాసిటీకి ఓలిట్మస్ టెస్ట్ లాంటిది. అయితే ఈ సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మంచి పాటలు కనిపిస్తున్నాయి. యూత్ హార్ట్స్ ను కొల్లగొట్టిన క్రేజీ బ్యూటీ కృతిశెట్టి ఉంది. అంతకు మించి క్రూరమైన విలనీ కనిపిస్తోంది. ఈ విలనీ వెనక బలమైన కథ ఉంటే..ఆ కథను ఈ పోలీస్ కొల్లగొడితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అదే టైమ్ రామ్ లాంటి హీరో అంత భారీ ఫైట్స్ చేస్తే జనం చూస్తారా అనేదీ డౌటే. ఏదేమైనా రామ్ కెపాసిటీకి ఇదో లిట్మస్ టెస్ట్ అనేది నిజం. ఈ టెస్ట్ లో అతను పాస్ అయితే.. ఏకంగా కుంభస్థలాన్ని కొట్టేసినట్టే అనుకోవచ్చు. లేదంటే మాత్రం పాతాళానికి వెళ్లినట్టవుతుంది.

Related Posts