థాంక్యూ ట్రైలర్ టాక్.. సింప్లీ సూపర్బ్ ..

థాంక్యూ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ట్రైలర్ వచ్చేసింది. కాస్త ఆలస్యమైనా.. సింప్లీ సూపర్బ్ అనిపించేసింది. చైతూ ఫ్యామిలీతో మనం వంటి క్లాసిక్ మూవీ తీసిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. నిజానికి ఈ నెల 8నే విడుదల కావాల్సి ఉంది. కానీ 22కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ట్రైలర్ ఆసాంతం పూర్తి పాజిటివ్ వైబ్స్ తో కనిపిస్తోంది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ కాబోతోందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
ఇక ఎక్కడో నారాయణపురం అనే చిన్న ఊరి నుంచి మొదలైన కుర్రాడి కథ ఇది. అక్కడి నుంచి అబ్రాడ్ వరకూ వెళ్లి ఎన్నో సక్సెస్ లు చూస్తాడు. ఈ క్రమంలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో అంశాలను చూపిస్తూ ఈ ట్రైలర్ సాగింది. ఓ రకంగా ఇది చాలామందికి నోస్టాల్జియా లాంటి ఫీలింగ్ ఇస్తుంది అనుకోవచ్చు. ముఖ్యంగా కథా నాయకుడి జీవితంలో మూడు దశలను చూపించారు. ఆ మూడు దశల్లో ముగ్గురు అమ్మాయిలు..

దశలను బట్టి స్నేహితులు.. ఇతరులు అంతా కనిపిస్తున్నారు. హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఎంత సాధించినా మూలాల్ని మర్చిపోకూడదు అనే సిద్ధాంతంపై ఉంటాడు. అందుకే ‘ మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదు అని నా ఫ్రెండ్ చెప్పాడు” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. అలాగే ”ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమకంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమ ఎంతో గొప్పది” చైతూ లైఫ్ కు కూడా వర్తిస్తాయి అనేలా కనిపిస్తున్నాయి.కొన్నాళ్లుగా వరుస విజయాలతో వెళుతున్నాడు చైతూ. ఈ సక్సెస్ ట్రాక్ ను థ్యాంక్యూ మరింత పెంచేలా కనిపిస్తోంది. ట్రైలర్ లో ఒక్కటంటే ఒక్క నెగెటివ్ ఫీల్ ఇచ్చే షాట్ లేకపోవడం విశేషం. సినిమా అంతా అలాగే కనిపిస్తే ఖచ్చితంగా ఈ నెల 22న థ్యాంక్యూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుంది. ఇటు విక్రమ్ కుమార్ కూడా వరుస ఫ్లాపుల నుంచి బయటపడేలా కనిపిస్తున్నాడు. ఈ మూవీ హిట్ అయితే వీరి కాంబినేషన్లోనే వస్తోన్న దూత అనే వెబ్ సిరీస్ పై అంచనాలు పెరుగుతాయి.

Related Posts