ఇదేంటీ ఆచార్యా.. ? తమరేవన్నా ఫార్టీస్ లో ఉన్నారా..?

పాఠాలు చెప్పే మాస్టారు.. స్కూల్ లో ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తే అదో పాపంగా చూస్తాం. మరి గుణపాఠాలు చెప్పే మాస్టారేంటీ ఇలా ఐటమ్ గాళ్స్ తో అదే పనిగా ఆడిపాడుతున్నాడు అనే అనుమానం వస్తే తప్పు ఖచ్చితంగా చిరంజీవితో పాటు కొరటాల శివదే. యస్.. ఈ సినిమా టైటిల్ కు, టీజర్ రిలీజ చేసినప్పుడు చెప్పిన డైలాగ్స్ తో పాటు చిరంజీవిపై వచ్చిన పాటలూ చూసిన తర్వాత చిరంజీవి ఇలా ఐటమ్ సాంగ్స్ కు డ్యాన్సులు కట్టడం చూస్తోంటే వీళ్లింక మారరు అనిపిస్తుంది కదా..? చిరంజీవి ఈ సినిమాలో చేస్తున్నది ఓ నక్సలైట్ పాత్ర. ఇప్పటి వరకూ ఆ పాత్రలను చాలా వరకూ గౌరవంగానే చూపించారు. అలాంటి పాత్ర హిందూదేవుడు, దేవాలయ పరిరక్షణ చేస్తాడు అని చెప్పడమే కాస్త ఆశ్చర్యం అయితే.. ఇంకా కథలు చెప్పకుండా కేవలం ఇమేజ్ తాలూకూ వ్యవహారాల్లో మునిగిపోయి వయసును కూడా మర్చిపోయి చిరంజీవి ఐటమ్ సాంగ్ చేయడం మాత్రం అస్సలు బాలేదనే విమర్శలు వస్తున్నాయి.
పైగా పాట లిరిక్స్ కూడా చిరంజీవి అనే నటుడి హుందాతనానికి దూరంగా ఉన్నాయి. నటుడన్న తర్వాత ఇంకా హుందా ఏంటీ అనే రివర్స్ క్వశ్చన్ వస్తే చేసేదేం లేదు. బట్.. ఒకప్పుడు చేసి ఉంటే చెప్పలేం. కానీ ఇప్పుడు ఆయన స్టేచర్ వేరే. కనీసం తన స్టేచర్ కు తనైనా రెస్పెక్ట్ ఇచ్చుకుంటే బావుండేదంటున్నారు చాలామంది. ‘శానాకష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకుపోనీ’ఇదీ లిరిక్. ఇప్పుడు చిరంజీవి ఇమేజ్ కు ఈ లైన్ తో పాటు ఆ స్టెప్పులు చూస్తుంటే ఇంకా ఆయన తన ఫార్టీస్ లో ఉన్నట్టుగా భావిస్తున్నాడా అనుకోవచ్చు. ఏదేమైనా మెగాస్టార్ గా తన రేంజ్ ను తనే తగ్గించుకునేలానే ఇలాంటివి కనిపిస్తున్నాయి తప్ప.. ఆచార్య అనే టైటిల్ పెట్టుకుని.. అటు నక్సలిజం, ఇటు హిందూయిజంల ప్రతినిధిగా కనిపించబోతున్నాడు అనే ప్రచారం సాగిస్తూ.. ఇలాంటి చవకబారు పాటలకు డ్యాన్సులు కడితే ఉన్న గౌవరం ఊడటం తప్ప మరో ఉపయోగం లేదు.

Related Posts