పవన్ కోసం వేచి చూస్తోన్న జగన్

ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది.. ఈ మాట వినగానే ప్రతి ఒక్కరూ ఆలోచింది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గురించే. యస్.. వీళ్లు కానీ ఒత్తిడి చేయకుండా ఉండి ఉంటే.. పవన్ కళ్యాణ్ సంక్రాంతికి ఖచ్చితంగా వచ్చేవాడే కదా. అనవసరంగా వీళ్ల వల్ల పవన్ ను కూడా పండగకు చూడకుండా అయిపోయిందని ఫ్యాన్స్ ఓ తెగ ఇదైపోతున్నారు. సోషల్ మీడియాలో ఐతే.. రాజమౌళితో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ ను ఓ రేంజ్ లో ఏసుకుంటున్నారు. కానీ ఇక్కడ పవన్ ఫ్యాన్స్ బాగా ఆలోచించాల్సి మేటర్ ఒకటుంది. అసలు ఆర్ఆర్ఆర్ ఎందుకు వాయిదా పడిందీ అని. ఒమిక్రాన్ కేస్ లు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో థియేటర్స్ లో 50శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పైగా విదేశాల్లో ఒమిక్రాన్ ఓ రేంజ్ లో ఉంది కాబట్టే.. ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది అనే సమాధానం ఇమ్మీడియొట్ గా వస్తుంది. మరి అదే సమాధానం భీమ్లా నాయక్ కు వర్తిస్తుంది కదా.. ? అదీ కాక ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాడు జగన్..? జగన్ ఈయన కోసం ఎందుకు చూస్తాడు.. చూస్తే వచ్చే నష్టమేంటీ అనుకుంటున్నారేమో.. అక్కడే ఉంది ట్విస్ట్.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు దారుణంగా తగ్గించారు అని కదా కొన్నాళ్ల నుంచి గొడవ జరుగుతోంది. మరి అది ఎప్పుడు జరిగింది..? పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలవుతున్నప్పుడే. అంటే పవన్ పై ఇన్ డైరెక్ట్ గా కక్ష సాధింపు చర్యగానే దాన్ని చూడాలి. ఆ తర్వాతే ఇండస్ట్రీ మొత్తానికి అప్లై అవుతుంది. అంటే పవన్ కోసం జగన్ కాచుకున్నాడు అనే కదా అర్థం. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ను తిడుతున్న వాళ్లు మరో విషయం గుర్తించాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కానీ సంక్రాంతికి విడుదల చేస్తాం అంటే వెంటనే జగన్ కూడా 50శాతమే థియేటర్స్ ఆక్యుపెన్సీ అనే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉంటే అది వారికే వదిలేయాలి. బట్.. నిజంగా పవన్ వస్తే.. ప్రస్తుతం ఆంధ్రలో ఒమిక్రాన్ కేస్ ల విజృంభణ లేకున్నా.. పవన్ కోసమైనా జగన్ థియేటర్స్ లో సగం ప్రేక్షకులకే అనుమతి అని అల్టిమేటమ్ ఖచ్చితంగా జారీ చేస్తాడు. సో.. ఇక్కడ రెండు విధాలుగా చెడిపోతాడు. ఒకటి తక్కువ టికెట్ రేట్లు.. మరోటి 50శాతం ఆక్యుపెన్సీ..
అంచేత జగన్ కాచుకున్నాడు. కాబట్టి భీమ్లా నాయక్ రాకపోవడం వల్ల పవన్ నిర్మాతలకు చాలా మేలు.

Related Posts