రాధేశ్యామ్ రిలీజ్ కి బ్రేక్..??

సినీ అభిమానులు అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అనుకుంటే.. కొత్త క‌ర‌నా ఓమిక్రాన్ అంటూ వ‌చ్చింది. కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు, కొన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్లు మూత‌ప‌డడం.. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అని కొత్త రూలు పెట్ట‌డంతో ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డింది. అయితే.. మ‌రో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్. ఈ సినిమా మాత్రం వెన‌క్కి త‌గ్గేదేలే అంటుంది.

అయితే.. ఆర్ఆర్ఆర్ ఎదుర్కునే ఇబ్బందులు రాధేశ్యామ్ కి ఉండవా? అంటే ఉంటాయి కానీ.. రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా పడాలంటే మహరాష్ర్ట.. కర్ణాటక రాష్ట్రాలు కీలకం అని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. పరిస్థితి మరీ అదుపు తప్పితే లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్నింగ్ లో ఉన్నాయి. కర్ణాటక మార్కెట్ కి రాధేశ్యామ్ కి కీలకమైంది.

మహరాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య పెరిగితే లాక్ డౌన్ తప్పదు. అదే జరిగితే రాధేశ్యామ్ వాయిదా పడుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీంతో రాబోయే రెండు వారాల వ్యవధిలోనే ఏం జరుగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌డం రాధేశ్యామ్ కి క‌లిసొచ్చే అంశ‌మే. అందుక‌నే రాధేశ్యామ్ నిర్మాత‌లు సైలెంట్ గా ఉన్నారు. మ‌రి.. రాధేశ్యామ్ రిలీజ్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts