మహేష్ కి విలన్ గా హృతిక్ రోషన్.. రాజమౌళి మాస్టర్ ప్లాన్

దర్శకధీరుడు రాజమౌళి గట్టిగా అనుకోవాలే కానీ కనీవినీ ఎరుగని కాంబినేషన్స్ ను కూడా సెట్ చేయగలడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకోసం అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాడట జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ కోసం అంతే దీటైన విలన్ ని వెతికే పనిలో ఉన్నాడట. అప్పుడు రాజమౌళి కళ్లముందు ప్రత్యక్షమైంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ప్రస్తుతం మహేష్ కోసం హృతిక్ ని విలన్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడట రాజమౌళి.

విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటే.. హీరో క్యారెక్టర్ అంతలా ఎలివేట్ అవుతుంది. ఈ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. జక్కన్న చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్ర మామూలుగా ఉండదు. అంతటి పవర్ ఫుల్ విలన్ ని సినిమా చివరి వరకూ ఎదుర్కొంటూనే ఉంటాడు హీరో. ఫైనల్ గా అతనిపై విజయాన్ని సాధిస్తాడు. ఆ ఫార్ములానే ఇప్పుడు మహేష్ సినిమాకోసమూ ఉపయోగిస్తున్నాడట. అందుకే.. ఈ సినిమాలో తాను డిజైన్ చేసిన పవర్ ఫుల్ విలన్ రోల్ కి హృతిక్ పర్ఫెక్ట్ గా సూటవుతాడని భావిస్తున్నాడట.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ ల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చిన్నప్పట్నుంచే నటనలోకి ప్రవేశించిన ఈ ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి హీరోలుగా మారారు. మహేష్.. టాలీవుడ్ అందాల రాకుమారుడు అయితే.. హృతిక్ బాలీవుడ్ కలల రాకుమారుడు. వీరిద్దరినీ ఒకే ఫ్రేములోకి తీసుకొస్తే ఆ ఫ్రేముకే నిండుదనమొస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ టచ్ తో సాగే ‘ధూమ్‘ సిరీస్ లో దుమ్మురేపాడు హృతిక్. మరి.. ఇప్పుడు రాజమౌళి కోసం మహేష్ తోనూ విలనీకి ఒప్పుకుంటాడేమో చూడాలి.

Related Posts