మహేష్ కి కండిషన్స్ పెడుతున్న రాజమౌళి

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే హీరో డామినేటెడ్ ఇండస్ట్రీగా చెప్పుకుంటాం. హీరో చెప్పిందే వేదం. హీరో తర్వాతే ఎవరైనా? అనేది ఇక్కడ ఎక్కువగా ప్రచారంలో ఉంటుంది. కానీ.. కొంతమంది దర్శకుల విషయంలో హీరో సెకండరీ అనే చెప్పాలి. అలాంటి వారిలో దర్శకధీరుడు రాజమౌళి ముందు వరుసలో నిలుస్తాడు. తన సినిమా కథ మొదలుకొని.. ప్రతీ విషయాన్ని తానే దగ్గరుండి శాసిస్తాడు. మహేష్ బాబు తో చేయబోయే సినిమాకోసమూ రాజమౌళి చెప్పిందే శాసనం. ఈ సినిమా కోసం మహేష్ కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడట రాజమౌళి.

మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టెక్నికల్ టీమ్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. తన రెగ్యులర్ టెక్నీషియన్స్ విజయేంద్రప్రసాద్, కీరవాణి ఈ చిత్రానికి కూడా పనిచేస్తుండగా.. తనతో ఎన్నాళ్లగానో వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ లకు మాత్రం గ్యాప్ ఇవ్వబోతున్నాడు జక్కన్న. ఈ చిత్రం కోసం కొత్త టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగుతోంది. అలాగే.. నటీనటుల ఎంపిక జోరుగానే సాగుతోంది.

ఈ సినిమాలో హీరో మహేష్ బాబు లుక్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట రాజమౌళి. హాలీవుడ్ నుంచి స్పెషల్ ట్రైనర్స్ ను తీసుకొచ్చాడట. అందుకోసమే.. కొన్ని నెలల పాటు మహేష్ ని ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావద్దని రాజమౌళి కోరినట్టు తెలుస్తోంది. మహేష్ లుక్‌ ని రహస్యంగా ఉంచాలనుకోవడమే దానికి కారణం. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్న మహేష్ కూడా.. దర్శకధీరుడి సూచనలను తూ.చ. తప్పుకుండా ఫాలో అయ్యే ప్రయత్నంలోనే ఉన్నాడట.

Related Posts