ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ ‘లవ్ మీ’. ఈ మూవీకి ‘ఇఫ్ యూ డేర్’ అనేది ట్యాగ్ లైన్. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకుడు. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ‘లవ్ మీ’ ఆడియన్స్ కు ఓ విభిన్నమైన అనుభూతిని అందిస్తోందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.
అసలు ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘లవ్ మీ’ మూవీ మే 25కి పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది టీమ్. రేపు (మే 16) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ‘లవ్ మీ’ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే.. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ మూవీ నుంచి మరో రెండు సాంగ్స్ ను కూడా వరుసగా రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించి.. ‘లవ్ మీ’ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.