‘దేవర’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఒకరోజు ముందే ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. మే 19న ‘దేవర’ నుంచి ‘ఫియర్’ పేరుతో సాంగ్ రాబోతుంది.

కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సంబంధించి ఇప్పటికే లిరికల్ వీడియోని రెడీ చేశారట. ఈ లిరికల్ సాంగ్ ఎంతో వైవిధ్యంగా ఉంటుందట. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర 1’ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts