‘పుష్ప 2’ నుంచి అనసూయ లుక్ అదరహో..!

యాంకర్ గా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై సైతం అడపాదడపా పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే.. అనసూయ నటించిన చిత్రాలలో ‘పుష్ప’ ఎంతో ప్రత్యేకం. ఈ సినిమాలో దాక్షాయనిగా నెగటివ్ రోల్ లో అదరగొట్టింది.. దాక్షాయని పాత్రలో ఆమె మేకోవర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని సరికొత్తగా డిజైన్ చేశాడు డైరెక్టర్ సుకుమార్.

మొదటి భాగంలో తక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినా.. రెండో భాగంలో మాత్రం అనసూయకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందట. ఈరోజు (మే 15) అనసూయ బర్త్ డే స్పెషల్ గా ‘పుష్ప 2’లో ఆమె పోషిస్తున్న దాక్షాయణి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్. ఈ లుక్ లో అనసూయ ఎంతో విలక్షణంగా అదరహో అనిపిస్తుంది.

Related Posts