“భీమ్లా నాయ‌క్” స‌రైనా నిర్ణ‌య‌మే తీసుకున్నాడా.?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాలి అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుండ‌డం మ‌రో వైపు రాధేశ్యామ్ రిలీజ్ అవుతుండ‌డంతో భీమ్లా నాయ‌క్ ని వాయిదా వేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆఖ‌రికి భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రికి వాయిదా ప‌డింది. దీంతో ప‌వ‌ర్ స్టార్ అభిమానులు బాగా ఫీల‌య్యారు. అయ‌తే.. ఇప్పుడు భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డ‌డం మంచిదే అంటున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..జ‌న‌వ‌రి 7 ఆర్ఆర్ఆర్ వేల స్ర్కీన్ ల‌లో విడుద‌ల అవుతుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తే.. క‌నీసం మూడు వారాలు థియేట‌ర్లో ఉండేలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. అలాగే రాధేశ్యామ్ కూడా దేశ వ్యాప్తంగా అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. ఈ రెండు సినిమాల‌తో పాటు అజిత్ మూవీ వ‌లిమై కూడా తెలుగులో రిలీజ్ కి రెడీ అయ్యింది. భారీగా కాక‌పోయినా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు దొరుకుతాయి. బంగార్రాజు విడుద‌ల అనేది ఇంకా తేల‌లేదు. ఒక‌వేళ బంగార్రాజు రిలీజ్ అయితే.. థియేట‌ర్ల స‌మ‌స్య మ‌రింత జ‌టిలం కావ‌డం ఖాయం.

ఇదిలా ఉంటే.. ఓమిక్రాన్ అంటూ ద‌డ పుట్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు మొద‌ల‌య్యాయి. సంక్రాంతికి ప‌రిస్థితి నార్మ‌ల్ గా ఉంటుందో ఉండ‌దో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒకవేళ సంక్రాంతి త‌ర్వాత కేసులు పెరిగినా టెన్ష‌నే. పైగా ఏపీలో టిక్కెట్ల వ్య‌వ‌హారం ఇంకా తేల‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌వ‌రిలో భీమ్లా నాయ‌క్ విడుద‌ల కావ‌డం కంటే.. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కావ‌డ‌మే మంచింది. అప్ప‌టికి అంతా సెట్ అవుతుంది. పైగా సోలో రిలీజ్ దొరుకుతుంది. అందుచేత భీమ్లా నాయ‌క్ స‌రైన నిర్ణ‌య‌మే తీసుకున్నాడు అంటున్నారు అదీ.. సంగ‌తి.

Related Posts