ఇండియ‌న్ ఐడల్ తెలుగుకి హోస్ట్ గా శ్రీరామ‌చంద్ర‌

బిగ్‌బాస్ 5 సీజ‌న్ లో మూడో స్థానంలో నిలిచి.. ఎంతో మంది మ‌న‌సు దోచుకున్న కంటెస్టంట్ సింగర్ శ్రీరామచంద్ర. సెటిల్డ్ గా గేమ్ ఆడి మిస్టర్‌ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. అంతే కాకుండా.. అద్బుతమైన పాటలతో ఇతర హౌజ్‌మేట్స్ తోపాటు ఆడియెన్స్ ని అలరించారు. సోషల్‌ మీడియాలో శ్రీరామచంద్రకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నిత్యం ట్రెండింగ్‌లో నిలిచారు. శ్రీరామచంద్ర టైటిల్‌ విన్నర్‌ అవుతారని చాలా మంది అనుకున్నారు. నాగచైతన్య ఇచ్చిన 20లక్షల ఆఫర్‌ని కూడా వదులుకున్నారు శ్రీరామచంద్ర. కానీ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నారు.

ఇదిలా ఉంటే శ్రీరామచంద్రకి ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్ వ‌చ్చింది. అది ఏంటంటే.. ఆయన ఓ షోకి హోస్ట్ గా చేసే అవకాశాన్ని అందుకున్నారు. శ్రీరామచంద 2013లో ఇండియన్‌ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్‌ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అవును.. ఇండియన్‌ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా మారుతున్నారు. ఆయన ఏకంగా ఇండియన్‌ ఐడల్‌కే హోస్ట్ గా చేస్తుండటం విశేషం.

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా త్వరలో తెలుగు ఇండియన్‌ ఐడల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ తెలుగు పాటల ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్‌ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆడిషన్స్‌ జరుపుకుంటున్న‌ తెలుగు ఇండియన్‌ ఐడల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మరి సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్ర.. హోస్ట్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

Related Posts