‘బడే మియా చోటే మియా’ ట్రైలర్.. అక్షయ్, టైగర్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ క్రేజీ మల్టీస్టారర్ ‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ అయితే ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ తో విజువల్ ట్రీట్ అందిస్తుంది. హిందీతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీలో సోనాక్షి సిన్హా , మానుషీ చిల్లార్, ఆలయ ఎఫ్. హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వశు భగ్నానీ, పూజా ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న ‘బడే మియా చోటే మియా’ విడుదలవుతోంది.

Related Posts