సమంత నుంచి మరో ఊ అంటావా మావా సాంగ్

పుష్ప ది రైజ్ .. ఈ మూవీలో అన్ని పాటలూ ఒక ఎత్తైతే ఊ అంటావా మావా అనే పాట ఒక ఎత్తు. అందుకు కారణం అందులో సమంత నర్తించడమే. యస్.. సమంత వల్ల ఈ పాటకు దేశవ్యాప్తంగా మరింత హైప్ వచ్చిందనేది కాదనలేని నిజం. పాటలోని అర్థాన్నంతా తన కళ్లతోనే పలికించి ప్రతి ఒక్కరూ ఆ పాటనే పలవరించేలా చేసింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు మరోసారి శామ్ అలాంటి పాటనే చేయబోతోంది. కేవలం ఈ పాట కోసమే సినిమా పూర్తయినా ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా ఉన్నారట. మరి అంత క్రేజీ సాంగ్ ఏ సినిమా నుంచి వస్తుందో తెలుసా..?ఇండియన్ మూవీస్ లో పాటలు ఎంత కీలకమో తెలుసు కదా.. ? నాలుగు నుంచి ఆరు పాటల వరకూ మస్ట్ అని ఫీలవుతుంటారు మన మేకర్స్. ఇందులోనూ చాలా సినిమాల్లో ఓ ఐటమ్ సాంగ్ మస్ట్. ఆ మస్ట్ అనే మాటకు మరింత క్రేజ్ పెంచుతూ.. హీరోయిన్ల చేతే ఐటమ్ సాంగ్స్ చేయిస్తున్నారు. పుష్ప సినిమాలో సమంత సాంగ్ ఎంత హైలెట్ అయిందో తెలుసు కదా.. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం నుంచి అంజలి చేసిన పాట కూడా అంతే హల్చల్ చేస్తోంది. అదీ హీరోయిన్లు చేసే స్పెషల్ సాంగ్స్ కు ఉండే క్రేజ్.ప్రస్తుతం సమంత చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. తను నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత చేసిన యశోద మూవీ అప్డేట్ కోసమే ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ అంతా ఈగర్ గా చూస్తున్నారు. ఆ అప్డేటే ఇది. యస్.. యశోద సినిమా షూటింగ్ పూర్తయింది.

కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆ పాట పుష్ప సాంగ్ లాగే చాలా సిజిలింగ్ గా ఉంటుందట. పైగా స్పెషల్ లొకేషన్ లోనే ఆ సాంగ్ ను పిక్చరైజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ లొకేషన్ వేటలోనే ఆ టీమ్ అంతా ఉంది. యశోద థ్రిల్లర్ మూవీగా వస్తోంది. ఆ థ్రిల్లర్ లో ఈ సాంగ్ ఒక్కసారిగా జిల్ మనిపించేలా కనిపిస్తుందట. ఆ కారణంగానే ఈ పాట కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారంటున్నారు.యశోద చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. హరి – హరీష్‌ ద్వయం దర్శకత్వం చేస్తున్నారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా వస్తోంది. అయినా శామ్ కు తోడుగా మళయాల నటుడు ఉన్ని ముకుందన్ కనిపించబోతున్నాడు. తనతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్‌, మురళీ శర్మ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇంకా చాలామందే ఉన్నారు. మొత్తంగా యశోద టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఈ పాట కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేస్తున్నారు. చూస్తోంటే ముందే చెప్పినట్టుగా ఈ మూవీ ఆగస్ట్ లో విడుదల కావడం సాధ్యం కాదేమో అంటున్నారు. మరి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గానే వస్తోన్న యశోదతో సమంత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Related Posts