హిట్లూ కావాలి కదా కిరణ్‌ ..?

హీరో అయినా వరుసగా సినిమాలు చేస్తున్నాడంటే అర్థం ఏంటీ.. ఆ హీరోకు మంచి మార్కెట్ ఉందని.. బిజినెస్ కూడా బాగా ఉందని. మార్కెట్ మేటర్ పక్కన బెడితే నెలకో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇలా సినిమాలైతే వస్తున్నాయి కానీ వాటి నుంచి హిట్ అనే మాట వినిపించడం లేదు. అయినా చేతినిండా సినిమాలతో రోజుకో అప్డేట్ అంటూ దూసుకువస్తున్నాడు. మరి ఇంత క్రేజ్ ఉన్నప్పుడు కాస్త కంటెంట్ పై కాన్ సెంట్రేట్ చేస్తే రేంజ్ మారుతుంది కదా..?అనుకుంటున్నారు కదా ఎవరైనా.. మరి ఈ విషయంలో ఈ హీరో ఫీలింగ్ ఏంటో కానీ ఇప్పుడు కూడా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూనే ఓ మీటర్ లో వస్తున్నాడు.
కిరణ్‌ అబ్బవరపు.. ఈ మధ్య కాలంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుగుతున్న కుర్రాడు అని టాలీవుడ్ అంతా ఫీలవుతోంది. ఫస్ట్ మూవీ రాజావారు రాణివారు కమర్షియల్ గానూ విమర్శియల్ గానూ ఆకట్టుకుంటుంది. అలా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన కిరణ్‌.. తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో మరోసారి మెప్పించాడు. కానీ ఆ తర్వాతే ట్రాక్ తప్పాడు.

కంటిన్యూస్ గా సెబాస్టియన్, సమ్మతమే అనే చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. మినిమం కంటెంట్ కూడా లేని సినిమాలుగా విమర్శకులు తేల్చేశారు. ఇలాంటి సందర్భాల్లో మరో హీరోకైతే నెక్ట్స్ ప్రాజెక్ట్ కనిపించదు. బట్ కిరణ్‌ విషయంలో ఇది కొత్తగా కనిపిస్తోంది.ఓ కొత్త హీరో వరుస ఫ్లాపులు చూస్తున్నాడు అంటే అంతకు ముందే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. కానీ కిరణ్ అబ్బవరపు విషయంలో అలా జరగడం లేదు. సమ్మతమే తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమాతో వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ కూడా ఎప్పట్లానే ఆకట్టుకునేలా ఉంది. దివంగత గ్రేట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతుండటం విశేషం. దీంతో పాటు రీసెంట్ గా తన బర్త్ డే సందర్భంగా మరో మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయ్యాయి. వీటిలో గీతా ఆర్ట్స్ వారి సినిమా కూడా ఉంది. ఈ మూవీ పేరు వినరో భాగ్యము విష్ణు కథ. ఆ తర్వాత రూల్స్ రంజన్, మీటర్ అనే సినిమాలు కూడా ఉంటాయని చెప్పారు. ఏదేమైనా కుర్రాడి స్పీడ్ టాప్ గేర్ లో ఉంది. దానికి తగ్గట్టుగానే కాస్త కంటెంట్ కూడా చూసుకుంటే బెటర్. మేటర్ లేని సినిమాలు ఎన్ని వచ్చినా స్టార్ మీటర్ లో నిలవడం కష్టం అవుతుంది.

Related Posts