పుష్ప ఖాతాలో రేర్ రికార్డ్..

ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటుతూనే ఉంది. ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ క్రేజ్ ను పెంచిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ మేనరిజమ్స్ నుంచి స్టెప్పులు వరకూ ప్రపంచం అంతా ఫాలో అవుతోంది. ప్యాన్ ఇండియన్ మూవీగా వచ్చి.. ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసుకుంది. లేటెస్ట్ గా మన దేశంలో మరే సినిమా సాధించని మరో రేర్ రికార్డ్ పుష్ప ఖాతాలో పడింది..తగ్గేదే లే.. అంటూ ఏ ముహూర్తంలో ఈ సినిమాలో డైలాగ్ పడిందో కానీ.. ఆ డైలాగ్ సినిమాకు సంబంధించి అన్ని విషయాల్లోనూ కనిపిస్తోంది. కలెక్షన్స్ నుంచి రికార్డుల వరకూ.. మేనరిజమ్స్ నుంచి.. స్టెప్పుల వరకూ ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ ఈ సినిమాను ప్రపంచం అంతా ఫాలో అవుతోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ తెలుగులో ప్లస్ అయితే.. అల్లు అర్జున్ క్రేజ్ ప్యాన్ ఇండియన్ లెవల్లో వర్కవుట్ అయింది. ఇటు కంటెంట్ కూడా రా గా ఉండటం..

అర్జున్ నటన అద్భుతం అనిపించుకోవడం, శ్రీ వల్లిగా రష్మిక మెస్మరైజ్ చేయడంతో పాటు దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అన్ని చార్ట్స్ లోనూ టాప్ ప్లేస్ లో నిలవడంతో ప్రపంచంలోని సెలబ్రిటీస్ అంతా ఈ సినిమాలోని ఏదో ఒక మూమెంట్ ను డబ్ స్మాష్‌ గానో లేక రీల్స్ గానో చేశారు. అదీ పుష్ప సాధించిన క్రేజ్.పుష్ప గురించి పొగడని సెలబ్రిటీ లేడంటే అతిశయోక్తి కాదు. సుకుమార్ టేకింగ్ కు టెక్నీషియన్స్ అంతా ఫిదా అయితే.. బన్నీ నటన చూసి అంతా అతనితో ప్రేమలో పడిపోయారు. మొత్తంగా ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ లేటెస్ట్ గా ఇండియాలోనే ఏ సినిమా సాధించిన అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. పుష్ప మ్యూజిక్ ఆల్బమ్ కు ఫైవ్ బిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే అక్షరాలా 500 కోట్లమంది ఈ పాటలను చూశారన్నమాట. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ ఇండియాలో ఇంకే సినిమాకూ లేదు. సాధారణ బడ్జెట్ తో మొదలైన పుష్ప ఏకంగా 350 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ కు మరింత భారీ బడ్జెట్ పెట్టేస్తున్నారు.. మరి ఈ పుష్ప ది రూల్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో కానీ.. పుష్ప ఆల్బమ్ సాధించిన ఫైవ్ బిలియన్ వ్యూస్ రికార్డ్ సాధించిన సందర్భంగా ఎంటైర్ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పేద్దాం..

Related Posts