కండలు కాదు అఖిల్.. కథలు పెంచాలి..

అక్కినేని అఖిల్.. ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్లేంత స్టేచర్ ఉన్నట్టుగా కనిపించలేదు మొన్నటి వరకూ. వరుసగా మూడు ఫ్లాపులు రావడమే అందుకు కారణం. రీసెంట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఎట్టకేలకే ఫస్ట్ హిట్ కొట్టాననిపించుకున్నాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ తో పోలిస్తే ఇదేమంత పెద్ద విజయం కాదు. ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది కాబట్టి.. అప్పుడే కమెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ లేటెస్ట్ గా అతను ఓ ఫోటో వదిలాడు. ఓ విపరీతంగా కండలు పెంచి కండలగండడుగా మారినట్టుగా ఉందా ఫోటో. మరి ఇంత సడెన్ గా అంత పెద్ద కండలు ఎందుకూ అంటే.. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ‘ఏజెంట్’అనే సినిమా చేస్తున్నాడు కదా.. ఈ మూవీలో అతనో స్పైగా కనిపిస్తాడట. మరి స్పై అంటే ఫైట్లూ గట్రా చేయాలి కదా. అందుకే అంటున్నారు. కానీ కండలు పెంచితే సినిమా హిట్టవ్వుద్దా అనే ప్రశ్నకు ఇప్పటికే ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి కదా. అంతెందుకు రీసెంట్ గా వచ్చే నాగశౌర్య ‘లక్ష్యం’సాధించలేకపోయాడు కదా..?
నిజానికి ఈ పిచ్చి మన ఇండియాలోనే ఉంటుంది కానీ.. హాలీవుడ్ లో టాప్ క్లాస్ మూవీస్ చేసిన ఏ హీరోకూ కండలు లేవు. వాళ్ల దగ్గర మంచి కథలే ఉన్నాయి. అందుకే ఇప్పటి వరకూ ప్రపంచం మొత్తం ది బెస్ట్ గా చెప్పుకునే జేమ్స్ బాండ్ కు కానీ, టామ్ క్రూజ్ కానీ అలా ఎప్పుడూ కండలు పెంచలేదే. వీళ్లు చేసినవన్నీ ది బెస్ట్ స్పై థ్రిల్లర్సే కదా. కథలు బావుంటే ఆడాయి. లేదంటే పోయాయి. దానికి కండలతో ఏం పని అని అడిగితే ఏం చెబుతారు. అలాగే జాకీచాన్ సైతం మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ పర్ట్ గా ఉన్నాడే తప్ప ఎప్పుడూ సిక్స్ ప్యాకులు, ఎయిట్ ప్యాకులు అంటూ బాడీని పాడు చేసుకోలేదు.
మరి అంచేత అక్కినేని అఖిల్ అయినా ఇంకే ఫ్యామిలీ హీరో అయినా.. కథలు బావుండేలా చూసుకుంటే మంచిది. మంచి ఫిజిక్ మెయిన్టేన్ చేస్తే చాలు.. ఇలా రాత్రికి రాత్రే కండలు పెంచి ఓ సిల్వస్టర్ స్టాలోన్ లా అయిపోతే ఆనక ఆరోగ్య సమస్యలు వచ్చి అసలుకే మోసం వస్తుంది. సో.. డియర్ అఖిల్.. ప్లీజ్ కాన్ సెంట్రేట్ ఆన్ గూడ్ స్టోరీస్.

Related Posts