Categories: Latest

అజిత్ కు అంత సీన్ లేదు.. కాబట్టే ఈ రేట్

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు అజిత్. అతనికి మాస్ తో పాటు క్లాస్ లో కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్స్ లో అజిత్ ఉన్నాడు. అజిత్ సినిమా అంటే బయ్యర్స్ కు పండగే. రిజల్ట్స్ తో పనిలేకుండా మాగ్జిమం రికవర్ అవుతుంటాయి అని వారి నమ్మకం. ఇదే రూట్ లో విజయ్ కూడా ఉంటాడు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడ సినిమాలవే కాదు.. ఇండస్ట్రీల పరిస్థితులూ, ఆడియన్స్ మైండ్ సెట్స్ అన్నీ మారిపోయాయి.

అందుకే ఎంత గొప్ప సినిమా చేసినా.. ఆ గొప్పను డప్పుగా మార్చి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాల్సిందే. కానీ ఈ విషయంలో అజిత్ ముందుకు రాడు. తన సినిమాల ప్రమోషన్స్ ను గురించి అస్సలు పట్టించుకోడు. ఒకప్పుడంటే హీరోలే దేవుళ్లు అని భావించిన కాలం కాబట్టి.. కంటెంట్ ఎలా ఉన్నా చూశారు. బట్ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. ఆ విషయం ఓ స్టార్ హీరోగా అతనికీ తెలుసు. అప్పుడు సినిమాను ప్రమోట్ చేయడం.. తన బాధ్యతగా తీసుకోవాల్సిన అజిత్.. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం చూపిస్తాడు. నిర్మాతలను ముక్కుపిండి వసూలు చేయడంలో ఉండే శ్రద్ధ ఆ నిర్మాతను బాగు చేయడం కోసం ఉండదు. అందుకే రోజు రోజుకూ అజిత్ సినిమాలపై ఆసక్తి తగ్గిపోతుంది అనేది ఈ మధ్య వస్తోన్న అతని సినిమాలు చూస్తే తెలుస్తుంది.


అప్పుడెప్పుడో దాదాపు మూడు దశాబ్ధాల క్రితం వచ్చిన ప్రేమలేఖ చిత్రంతో తెలుగువారిని మెప్పించాడు. కానీ దాన్ని మార్కెట్ గా మార్చుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. లేదంటే కమల్ హాసన్, రజినీకాంత్ తర్వాత తెలుగులో పెద్ద మార్కెట్ అతనిదే ఉండాల్సింది. ఆ ప్లేస్ లో తర్వాత సూర్య, కార్తీ వచ్చారు. బట్ అజిత్ కుఇక్కడ అంత సీన్ లేకపోవడానికి కారణం.. ప్రమోషన్స్ లో పాటించే నిర్లక్ష్యమే. మరోవైపు కొన్నాళ్ల క్రితమే తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ ను రద్దు చేశాడు. ఇప్పటికీ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నా.. అతను రద్దు చేసిన తర్వాత చాలామంది హర్ట్ అయ్యారు అనేది నిజం. అందుకే అజిత్ మార్కెట్ తమిళ్ లోనే తగ్గుతోంది. ఇక తెలుగులో లేదు అని ఆశ్చర్యపోవడంలో అర్థం లేదు.


అజిత్ రీసెంట్ మూవీ వలిమై. కార్తికేయ విలన్ గా నటించిన ఈ మూవీ తెలుగు లో డిజాస్టర్ అయితే తమిళ్ లో యావరేజ్ గా నిలిచింది. బట్ విజయ్ బీస్ట్ కంటే బెటర్ అనిపించుకుంది. ప్రస్తుతం తునివు అనే సినిమాతో వస్తున్నాడు అజిత్. ఈ చిత్రాన్ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కేవలం 3 కోట్లకే అమ్మేసుకున్నారు. నిజానికి ఇతర తమిళ్ హీరోలు డబ్బింగ్ సినిమాలైనా తెలుగులో టైమ్ ఇచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తారు. అజిత్ చేయడు. పైగా ఆ సినిమాలో అతను తప్ప తెలుగువారికి తెలిసిన స్టార్ కాస్ట్ పెద్దగా లేదు. అలాంటప్పుడు ఈ మూడు కోట్లే పెద్ద మేటర్ కదా..? సో.. అజిత్ మార్కెట్ గురించి జాలి పడాల్సిన పనిలేదు. అతనికి ఇక్కడ అంత సీన్ లేదు కాబట్టే.. ఆ మార్కెట్ అని అర్థం చేసుకోవడమే.

Telugu 70mm

Recent Posts

మే 19న డైరెక్టర్స్ డే గ్రాండ్ ఈవెంట్

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన…

49 mins ago

దర్శక శిఖరం దాసరి నారాయణరావు జయంతి

వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు శ్రీశ్రీ. ఆ మాటలు ఎంత నిజమో దాసరి నారాయణరావును చూస్తే అర్థమౌతుంది. ఓ దిగ్ధర్శకుడిగా…

1 hour ago

చెన్నై సోయగం త్రిష బయోగ్రఫీ

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్స్‌ స్పాన్ చాలా తక్కువనే నానుడి ఉంది. అయితే.. త్రిష వంటి కథానాయికను చూస్తే…

1 hour ago

విడుదలకు ముస్తాబవుతోన్న ‘లగ్గం’

తెలుగు కల్చర్ తో జరిగే పెళ్లిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల…

2 hours ago

యశ్ సరసన నయనతార నటించబోతుంది

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ యశ్.…

3 hours ago

భయపెట్టడానికి వస్తోన్న భరత్ ‘మిరల్’

'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ 'మిరల్'. 'స్కేర్' అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. భరత్ కి…

5 hours ago