Featured

చెన్నై సోయగం త్రిష బయోగ్రఫీ

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్స్‌ స్పాన్ చాలా తక్కువనే నానుడి ఉంది. అయితే.. త్రిష వంటి కథానాయికను చూస్తే అది తప్పేమో అనిపిస్తోంది. ఇండస్ట్రీకొచ్చి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న త్రిష.. 22 ఏళ్ల పాటు కథానాయికగా కొనసాగుతూనే ఉంది. ఇక.. హీరోయిన్‌గా త్రిష పనైపోయిందనుకుంటున్న సమయంలో మళ్లీ గ్రేట్ కమ్‌బ్యాక్ ఇస్తూ తన స్టార్‌డమ్ ను చాటుకుంటూనే ఉంది. మే 4న త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రిష సినీజీవిత విశేషాలను తెలుసుకుందాం.

త్రిష చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి సపోర్ట్ తో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి రాణించింది. 1999లో మిస్ మద్రాస్ కంటెస్ట్ లో పాల్గొంది. అదే ఏడాది ప్రశాంత్ నటించిన ‘జోడీ’లో చిన్న పాత్రలో నటించింది. 2002లో ‘మౌనం పెసియాదే’ చిత్రంతో హీరోయిన్ గా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 2003లో ‘సామి’ చిత్రంతో తమిళంలో హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకుంది. అదే ఏడాది తరుణ్ హీరోగా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘నీ మనసు నాకు తెలుసు’ తెలుగులో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా.. ఆ సినిమా త్రిషకి ‘వర్షం’ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెడితే.. త్రిషకి యూత్ లో ఫాలోయింగ్ తో పాటు వరుస ఆఫర్లను తెచ్చిపెట్టింది. అందంతో పాటు.. పెర్ఫార్మెన్స్ తోనూ ఆకట్టుకుని ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా సాధించింది. ఈ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఇంత అందమైన అమ్మాయిని ముందుగా నా సినిమాలో తీసుకోనందుకు ఫీల్ అవుతున్నాను అనడం విశేషం.

2004లో వచ్చిన ‘వర్షం’తో తెలుగులో అప్పటి టాప్ హీరోయిన్ లకు పోటీగా మారిన త్రిష, అదే ఏడాది తమిళంలో ‘గిల్లి’ చిత్రంతో టాప్ పొజిషన్ కి చేరుకుంది. ఇళయదళపతి హీరోగా నటించిన ‘గిల్లీ’ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా తెలుగులో మహేష్ నటించిన ‘ఒక్కడు’కి రీమేక్. ‘గిల్లీ’లో అప్పుడిపోడు అనే పాటని ఇప్పటికీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక.. ఇటీవలే ‘గిల్లీ’ రీరిలీజులో 25 కోట్లు వసూలు చేయడం విశేషం.

‘వర్షం’ చిత్రాన్ని నిర్మించిన ఎమ్.ఎస్.రాజు.. ప్రభుదేవా దర్శకత్వంలో త్రిష, సిద్దార్ధ్ జంటగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని నిర్మించారు. పేద, ధనిక వర్గాల యువతీయువకుల మధ్య సాగే లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ళ రిలేషన్ కూడా ఉంటుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పాటలు కూడా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో త్రిష పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పాలి. అందుకే త్రిషకి ఫిల్మ్ ఫేర్ కూడా దక్కింది.

త్రిష తెలుగులో నటించిన సినిమాల్లో ‘అతడు’ స్పెషల్ మూవీ. కమర్షియల్ హీరోయిన్ పాత్రలా కాకుండా అమాయకత్వం, చిలిపిదనం నిండిన పాత్రలో త్రిష నటించి మెప్పించింది. ఈ సినిమా పాటల్లోనూ తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసినప్పటికీ, పెర్ఫార్మెన్సే ఎక్కువగా గుర్తుంటుంది. మహేష్, త్రిష కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఎట్రాక్టివ్ గా ఉంటాయి.

త్రిషకి తెలుగులో వెంకటేష్ తో చేసిన సినిమాలు ఎక్కువ సక్సెస్ ని ఇచ్చాయి. వెంకీతో మూడు సినిమాల్లో నటించింది త్రిష. వాటిల్లో ‘ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే’ సూపర్ హిట్ అయ్యింది. పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిగా పరువు, ప్రతిష్టలకు విలువనిచ్చే గడసరి అమ్మాయిగా త్రిష పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అయ్యింది. ఈ సినిమాకి కూడా త్రిషకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.

ప్రభాస్ తో త్రిష మూడు సినిమాలు చేసింది. వాటిల్లో ‘వర్షం’ పెద్ద హిట్ అయితే ‘పౌర్ణమి’ నిరాశపరచింది. ఇక మూడో సినిమా ‘బుజ్జిగాడు’ యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ తో రెండు సినిమాలు చేసింది. ‘అతడు’ హిట్ అయితే ‘సైనికుడు’ నిరాశపరచింది. సీనియర్ స్టార్స్ తోనూ నటించి మెప్పించింది త్రిష. ఇక మిగిలిన సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవితో ‘స్టాలిన్’, నాగార్జునతో ‘కింగ్’, బాలయ్యతో ‘లయన్, ‘లో నటించింది. పవన్ కళ్యాణ్ తో ‘తీన్ మార్’, ఎన్టీఆర్ తో ‘దమ్ము’ చిత్రాల్లో నటించింది. అవాగే రవితేజతో ‘కృష్ణ’ మూవీ చేసింది.

ఇండస్ట్రీలో ఓ పదేళ్ళపాటు సక్సెస్ ఫుల్ గా కెరీర్ రన్ చేసిన తర్వాత కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో త్రిష ఒక దశలో ‘కళావతి, నాయకి’ వంటి లేడీ ఓరియంటెడ్ హార్రర్ చిత్రాల్లోనూ నటించింది. అదే టైమ్ లో తమిళంలో చేసిన కొన్ని సినిమాల ఫలితం కూడా త్రిష కెరీర్ పై ప్రభావం చూపించాయి. ఇక పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది త్రిష. ఓ బిజినెస్ మాన్ తో లవ్ మ్యారేజ్ కి రెడీ అయ్యాక అది ఆగిపోయింది. ఆ టైమ్ లో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యింది.

త్రిష కెరీర్ ని మలుపు తిప్పి మళ్ళీ బిజీ అయ్యేలా చేసిన చిత్రం ’96’. టీనేజ్ లవ్ స్టోరీ అనే పాయింట్ తో వచ్చిన ’96’ తమిళంలో ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. త్రిష, విజయ్ సేతుపతిల పెర్ఫార్మెన్స్ ’96’ సక్సెస్ లో కీ రోల్ పోషించాయి. ఈ చిత్రంలో త్రిష పెర్ఫార్మెన్స్ కానీ, లుక్స్ కానీ మళ్ళీ యూత్ ని ఆమెను ఇష్టపడేలా చేశాయంటే ఆశ్చర్యంలేదు. ’96’ మూవీ సక్సెస్ తో త్రిష కెరీర్ మళ్ళీ స్పీడందుకుని భారీ ప్రాజెక్ట్స్ తన దగ్గరకు చేరాయి.

ప్రస్తుతం తమిళంలో సీనియర్ హీరోలు కమల్ హాసన్, అజిత్ లకు జోడీగా నటిస్తుంది త్రిష. కమల్-మణిరత్నం ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్‘లో త్రిష హీరోయిన్. అజిత్ ‘విదా ముయార్చి‘లోనూ కథానాయికగా నటిస్తుంది. ఇక.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో నాయికగా నటిస్తుంది. ‘స్టాలిన్’ తర్వాత చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ఇది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘విశ్వంభర’ విడుదలకు ముస్తాబవుతోంది.

ఈరోజు (మే 4న) త్రిష పుట్టినరోజు సందర్భంగా.. చెన్నై సోయగం కు బర్త్ డే విషెస్ చెబుతోంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Telugu70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 hours ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago