*”ఆర్ఆర్ఆర్” వ‌ల‌్ల ఎన్టీఆర్ ఎంతపోయాడో కదా..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమా చేయ‌డం వ‌ల‌న ఏకంగా మూడు సంవ‌త్స‌రాలు పాటు మ‌రో సినిమా చేయ‌లేదు. 2018లో ఎన్టీఆర్ అర‌వింద స‌మేత సినిమా చేశాడు. ఆత‌ర్వాత నుంచి ఎన్టీఆర్ సినిమా మ‌రోక‌టి విడుద‌ల కాలేదు. 2019, 2020, 2021.. ఈ మూడు సంవ‌త్స‌రాల్లో ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా విడుద‌ల అవ్వ‌లేదు. దీంతో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేయ‌డం వ‌ల‌న ఎంత న‌ష్టం వ‌చ్చింది అనేది లెక్క‌లేస్తున్నారు సినీ జ‌నాలు.

గతంలో ఎన్టీఆర్ ఒక్క సినిమాకు రూ.30 కోట్లు పారితోషికం తీసుకునేవాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ దాదాపుగా 50 కోట్లు అందుకుంటున్నాడు. ఈ లెక్కన సంవ‌త్స‌రానికి ఒక సినిమా చేసినా మూడు సంవ‌త్స‌రాల‌కు 150 కోట్లు పారితోషికం వచ్చి ఉండేది. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకి 45 కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నార‌ని టాక్ వచ్చింది. ఈ లెక్క‌న ఈ మూడు సంవ‌త్స‌రాల్లో ఒక్క ఆర్ఆర్ఆర్ చేయ‌డం వ‌ల‌న‌ 100కోట్ల‌కు పైగానే న‌ష్టం వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

అందుక‌నే ఇక నుంచి ఇంత గ్యాప్ రాకుండా ఉండేదుకు వ‌రుస‌గా సినిమాలు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. కొర‌టాల శివ‌, బుచ్చిబాబు సానా, ప్ర‌శాంత్ నీల్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ల‌తో ఎన్టీఆర్ భారీ చిత్రాలు చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Related Posts