అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం

ఓ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, బాక్సాఫీస్ నెంబర్స్, సినిమాకు వచ్చిన ఆదాయం ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రభుత్వపరంగా ఏ చిన్న ప్రోత్సాహం దొరికినా దాన్ని ప్రత్యేకంగా భావించాలి. అవి ఆవార్డులైనా మరే గుర్తింపు అయినా ఎంతో స్పెషల్ అవుతుంది. అల్లు అర్జున్ కు పుష్ప చిత్రంతో ఇలాంటి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల దేశవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన పుష్ప సినిమా బాలీవుడ్ లో అనూహ్య విజయాన్ని సాధించింది. హిందీలో పుష్ప సాధించిన విజయం అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికీ వెళ్లింది.

ఇటీవల కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కోవిడ్ జాగ్రత్తలపై ఓ ప్రకటన విడుదల చేసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టిల్ కు మాస్క్ పెట్టి ..డెల్టా, ఓమిక్రాన్ ఏదైనా నేను మాస్క్ తీసేదెలే అని క్యాప్షన్ రాసి ప్రచారం ప్రారంభించింది. కేంద్ర సమాచార శాఖ ఒక సినిమా క్రేజ్ ను ఇలా కోవిడ్ ప్రచారంలో వాడుకోవడం ఇదే తొలిసారి. ఇది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవం. ఓ రీజనల్ ఫిల్మ్ దేశీయంగా గుర్తింపు రావడం హీరో అల్లు అర్జున్ తో పాటు మొత్తం టీమ్ కు గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

ప్యాన్ ఇండియా సినిమాగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప సినిమా గతేడాది డిసెంబర్ 17న దేశ వ్యాప్తంగా విడుదలైంది. రెండు పార్టుల పుష్ప సినిమా పుష్ప ద రైజ్ కోవిడ్ భయాల మధ్య థియేటర్ల నుంచి రికార్డు వసూళ్లు రాబట్టింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ బాక్సాఫీస్ నెంబర్స్ సాధించాయి. హిందీలో పుష్ప సాధించిన విజయం మొత్తం ఇండస్ట్రీ అవాక్కయ్యేలా చేసింది.

Image

Image

Related Posts