తెలుగు సినిమా కోసం త‌పిస్తున్న నార్త్ నిర్మాత‌లు

ఒక‌ప్పుడు హిందీ సినిమాల‌ను చూసి.. ఆ సినిమాల స్పూర్తితో మ‌న ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు క‌థ‌లు రాసుకునేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ సినిమాల‌కు ముఖ్యంగా తెలుగు సినిమాల‌కు నార్త్ లో మాంచి డిమాండ్ ఏర్ప‌డింది. మ‌న సినిమాల‌ను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ బ‌డా నిర్మాత‌లు క్యూక‌డుతున్నారు. ఒక‌టి కాదు రెండు కాదు.. మూడు కాదు ఏకంగా ఓ పాతిక తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయంటే.. మ‌న సినిమాల‌కు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

జెర్సీ, అల‌.. వైకుంఠ‌పుర‌ములో, హిట్, విక్ర‌మ్ వేదా, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, అప‌రిచితుడు, 16, దృశ్యం 2, రాక్ష‌సుడు, రెడ్, కోమ‌లి, న‌గ‌రం, యూట‌ర్న్, నాంది, భీమ్లా నాయ‌క్, ఛ‌త్ర‌ప‌తి, ఎఫ్ 2, బ్రోచేవారెవ‌రురా.. ఇలా దాదాపు పాతిక సినిమాలు రీమేక్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు స‌గం షూటింగ్ పూర్తి చేసుకోగా, కొన్ని షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం చిత్రాల‌ను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న‌ప్ప‌టికీ క‌న్న‌డ సినిమాలను మాత్రం రీమేక్ చేసేందుకు అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు.

అస‌లే క‌థ‌లు కొర‌త‌తో ఉన్న ఇండ‌స్ట్రీకి ఓ భాష‌లో స‌క్స‌స్ అయితే చాలు… రీమేక్ చేసేందుకు ముందుకొస్తున్నారు. దీనిని బ‌ట్టి బాలీవుడ్ లో క్రియేటీవిటీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Related Posts