మెగాస్టార్ కి అమెరికాలో అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారతీయ నటుల్లోనే ఇప్పటివరకూ పద్మవిభూషణ్ పొందిన చాలా తక్కువ మంది నటుల్లో చిరంజీవి ఒకరు. అలాగే.. దక్షిణాదిన అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్ తర్వాత ఈ ఘనత సాధించిన నటుడిగా చిరు కీర్తి గడించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా.. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద చిరంజీవి ఫోటోని ప్రదర్శించి.. ఆయనకు పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న విజువల్స్ అక్కడ వ్యూవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Related Posts