విజయ్ దేవరకొండ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విష్ లిస్ట్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా కూడా ఉంది. ‘జెర్సీ‘ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికయ్యింది. అయితే.. ఏమైందో ఏమో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వలేదు. మధ్యలో విజయ్ ‘ఫ్యామిలీ స్టార్‘తో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో.. అసలు విజయ్ తో సితార సినిమా ఉంటుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.

లేటెస్ట్ గా ‘వి.డి. 12‘పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ పూర్తవ్వగానే.. తమ నిర్మాణంలో సినిమా మొదలవుతుందని నాగవంశీ చెప్పారు. ఇక.. ఈ మూవీలో శ్రీలీల బదులు ‘యానిమల్‘ బ్యూటీ త్రిప్తి డిమ్రి లేదా మీనాక్షి చౌదరి లలో ఒకరిని కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. విజయ్ దేవరకొండ 12 లేటవ్వడంతో.. అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సితార లోనే ‘మ్యాజిక్‘ అనే చిన్న సినిమాని పూర్తిచేశారు నిర్మాత నాగవంశీ. ‘మ్యాజిక్‘ మూవీ ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts