మరోసారి సెట్ అయిన మ్యాజికల్ కాంబో

మాస్ మహారాజ రవితేజ పరిచయం చేసిన దర్శకుల్లో టాలెంటెడ్ హరీష్ శంకర్ ఒకడు. రవితేజ నటించిన ‘షాక్’ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమా షాక్ ఇచ్చినా.. ఆ తర్వాత ‘మిరపకాయ్’తో మంచి విజయాన్నందుకుంది ఈ కాంబో. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ సెట్టయ్యింది. వీరిద్దరి కలయికలో సినిమాని అధికారికంగా ప్రకటించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించబోతుంది. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫోటో షూట్ కూడా జరిగిందట. మరోవైపు మలినేని గోపీచంద్ తో రవితేజా నటించాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడంతో.. ఆ ప్లేసులో ఈ మూవీని సెట్ చేశాడు మాస్ మహారాజ. ఇక.. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొంతకాలం తాత్కాలికంగా ఆగినట్టు తెలుస్తోంది. రవితేజ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత ‘ఉస్తాద్..’ని ఫినిష్ చేయనున్నాడట హరీష్ శంకర్.

Related Posts