అదే స్టైల్.. అదే ఎనర్జీ.. మరోసారి వేట మొదలు

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే స్టైల్. ఆయన స్టైలిష్ గా నడుచుకుని వస్తే చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతాయి. రజనీకాంత్ గన్ పట్టుకుని వేట మొదలుపెడితే విలన్లు చిత్తుచిత్తవుతారు. ‘జైలర్’ విషయంలో అది చూశాం. ఇప్పుడు అప్ కమింగ్ మూవీలోనూ అదే తరహా స్టైల్స్, స్వాగ్ తో దుమ్మురేపబోతున్నాడు సూపర్ స్టార్. రజనీకాంత్ 170వ సినిమాకి ‘వేట్టయాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగులో ‘వేటగాడు’ అని అర్థం. రజనీకాంత్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ఈ మూవీ టైటిల్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

‘జై భీమ్’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా.. టాలీవుడ్ నుంచి రానా, మాలీవుడ్ నుంచి ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ వంటి భారీ తారాగణమే ఈ సినిమాలో నటిస్తుంది. అనిరుధు సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే యేడాది ప్రథమార్థంలో విడుదలకానుంది.

Related Posts