‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ నుంచి రెండో గీతం ‘ఓ మై బేబీ’ విడుదలైంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా.. శిల్పా రావు మనోహరమైన స్వరంతో ఆలపించింది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ పాట శ్రోతలను కట్టిపడేస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కి జోడీగా శ్రీలీల నటిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తుంది. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది.

Related Posts