వెటరన్ స్టార్స్ కు కొత్త లైఫ్ ఇస్తోన్న డైరెక్టర్

ఫ్లాపుల్లో ఉన్న వెటరన్ హీరోలను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించడం అంత సులువు కాదు. అందరు దర్శకులూ సాధ్యం కాదు కూడా. బట్ ఈ దర్శకుడు అలాంటి హీరోలను బాగా హ్యాండిల్ చేస్తున్నాడు.. వారి కెరీర్ కు కొత్త టర్న్ ఇస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే ఊహించే ఉంటారు కదా.. ? యస్.. ప్రవీణ్ సత్తారు. అతని పని అయిపోయింది అనుకున్న రాజశేఖర్ కు గరుడవేగతో కొత్త కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జునతో ఘోస్ట్ అనే సినిమాతో వస్తున్నాడు ప్రవీణ్. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగ్ కూడా బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని అర్థమౌతోందంటున్నారు.


కొన్ని సినిమాల రిజల్ట్ ఏంటనేది ట్రైలర్ చూసే చెప్పేయొచ్చు. అలాగని చెప్పినవన్నీ సూపర్ హిట్ అవుతాయని కాదు. బట్ మాగ్జిమం స్కోప్ ఉంటుందా సినిమాలకు. నాగార్జున హీరోగా నటించిన ఘోస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత టాలీవుడ్ మొత్తం నుంచీ ష్యూర్ హిట్ అని వినిపిస్తోంది. యస్.. స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ మూవీ అంటున్నారు. ప్రవీణ్‌ సత్తారు టేకింగ్, మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఇప్పటికే అతను టాలీవుడ్ లో తనకంటూ ఓ కొత్త పాథ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ రూట్ లోనే ఈ సినిమా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.


చిన్నప్పుడే తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తను తమ్ముడిని అని తెలియకుండా అక్క ఫ్యామిలీని కాపాడే బాధ్యత తీసుకున్న విక్రమ్ అనే సెక్యూరిటీ పాత్రలో కనిపిస్తున్నాడు నాగ్. ఇలాంటి కథలు గతంలో కూడా వచ్చాయి. బట్.. సెంటిమెంట్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఉండటం.. రెగ్యులర్ కు భిన్నంగా మాఫియా అంతా కలిసి ఓ సెక్యూరిటీ పర్సన్ కోసం వెదుకుతూ అతన్ని చంపాలనుకోవడం కొత్తగా కనిపిస్తోంది. సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ కూడా బానే ఉన్నట్టుంది. మొత్తంగా ఘోస్ట్ తో నాగ్ మళ్లీ తన తరం హీరోల్లా ఫామ్ లోకి వస్తాడు అంటున్నారు. అలా చేస్తే వెటరన్స్ నుంచి ప్రవీణ్‌ సత్తాకు మంచి డిమాండ్ పెరుగుతుందేమో.

Related Posts