ఖుషీ డైరెక్టర్ తో వెంకటేష్

ఆ మధ్య దూకుడుగా కనిపించి తర్వాత సడెన్ గా స్లో అయ్యాడేంటా అనిపించాడు విక్టరీ వెంకటేష్‌. నిజానికి వెంకీ స్లో అవలేదు. మధ్యలో రెండు సినిమాలు ఓటిటిలో రావడం వల్ల ఎక్కువ స్పాన్ లో కనిపించలేదు. రీసెంట్ గా ఎఫ్3తో మరోసారి తనదైన శైలిలో అదరగొట్టాడు వెంకీ. ప్రస్తుతం రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాడు. దీంతో పాటు లేటెస్ట్ గా ఓ కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ దర్శకుడెవరో తెలిస్తే ఖచ్చితంగా వెంకటేష్‌ ది మంచి ఛాయిస్ అంటారు.


టాలీవుడ్ లోని నిన్నటి తరం స్టార్ హీరోలందరిలోనూ విక్టరీ వెంకటేష్‌ చాలా స్పెషల్. నలుగురికీ స్పెషల్ ఇమేజ్ ఉన్నా.. వెంకీకి మాత్రమే మిగతా ముగ్గురి ఇమేజ్ కూడా ఉంది. అందుకే అతని ఖాతాలో అన్ని అవార్డులున్నాయి. దృశ్యం, ఎఫ్‌2లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన వెంకటేష్‌ తర్వాత వెంకీమామ, నారప్ప, దృశ్యం2 తో పాటు రీసెంట్ గా ఎఫ్3తో మరోసారి సత్తా చాటాడు. అన్నీ విజయాలే. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. మరి విజయం ఇచ్చే కిక్ వేరే ఉంటుంది కదా. ఎలాంటి సినిమాలు చేసినా వెంకటేష్ అనగానే మనకు ఫ్యామిలీ హీరోగానే ఎక్కువగా గుర్తొస్తారు. మరి ఆ తరహా చిత్రాలతోనే ఆకట్టుకునే దర్శకుడితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. యస్.. ఖచ్చితంగా వెంకీ ఇమేజ్ కూడా యాడ్ అయ్యి బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది.


తొలి రెండ సినిమాలతో తనదైన ముద్రను వేసిన దర్శకుడు శివ నిర్వాణ. నిన్నుకోరి, మజిలీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించాడు శివ. మధ్యలో టక్ జగదీష్ పోయినా ఇప్పుడు.. విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అతను వెంకటేష్‌ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శివ నిర్వాణ ఖుషీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ చివరి స్టేజ్ కు రాగానే ఈ కొత్త కాంబినేషన్ అనౌన్స్ అవుతుంది. ఇక షూటింగ్ నెక్ట్స్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో.. సెన్సిబుల్ స్టోరీస్ తో మెప్పించే శివ నిర్వాణ వెంకీ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశాడో చూడాలి.

Related Posts