దసరా బరిలో ఎన్టీఆర్ తో పోటీకి సిద్ధమవుతోన్న రజనీకాంత్?

సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ చిత్రం ‘వేట్టయాన్’. మెగా మల్టీస్టారర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి, మాలీవుడ్ నుంచి ఫహాద్ ఫాసిల్, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

రజనీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. అక్టోబర్ లో ఈ సినిమా విడుదలయ్యే తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. అక్టోబర్ లో దసరా కానుకగా ‘వేట్టయాన్’ వస్తోంది అనేది కోలీవుడ్ టాక్. ఇప్పటికే దసరా బరిలో తెలుగు నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర 1’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో.. ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయాన్’ మధ్య పోటీ తప్పేలా లేదు.

‘వేట్టయాన్’ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక.. ‘వేట్టయాన్’ రిలీజ్ పోస్టర్ లో రజినీ స్టైల్, ఆ నవ్వు, ఆ గన్ను పట్టిన విధానం, ఆ హెయిర్ స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పించేలా ఉన్నాయి.

Related Posts