‘విశ్వంభర‘కి విలన్ సెట్ అయ్యాడు

వెండితెరపై చిరంజీవి హీరోయిజానికి దీటుగా విలనిజాన్ని పండించారు విలక్షణ నటుడు రావుగోపాలరావు. 80లలో చిరంజీవి, రావుగోపాలరావు కాంబినేషన్ లో ఎన్నో సినిమాలొచ్చాయి. ఇప్పుడు రావుగోపాలరావు తనయుడు రావు రమేష్.. మెగాస్టార్ కి విలన్ గా మారుతున్నాడట. చిరు సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర‘లో ఓ దుష్ట మాంత్రికుడు పాత్రలో కనువిందు చేయనున్నాడట రావు రమేష్.

చిరంజీవి సూపర్ హిట్ సోషియో ఫాంటసీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహాలో ‘విశ్వంభర‘ రూపొందుతోంది. కథ పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ.. ‘విశ్వంభర‘లోనూ మాయలు , మంత్రాలకు సంబంధించిన అంశాలు పుష్కలంగా ఉంటాయట. ఇక.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ సినిమాలో పవర్ ఫుల్ మాంత్రికుడిగా అమ్రిష్ పురి చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. ‘విశ్వంభర‘లోనూ అలాంటి అలాంటి తరహా పాత్రనే డిజైన్ చేశాడట డైరెక్టర్ వశిష్ట. ఆ రోల్ ని రావు రమేష్ పోషించనున్నాడట.

ఆల్రెడీ రామ్ చరణ్ ‘మగధీర‘లో మాంత్రికుడిని పోలిన పాత్రలో మెప్పించాడు రావు రమేష్. ఆ క్యారెక్టర్ లో రావు రమేష్ ఆహార్యం ఆకట్టుకుంటుంది. మరోవైపు.. మెగాస్టార్ తో కలిసి ఫుల్ లెన్త్ మూవీలో నటించాలనే కోరిక రావు రమేష్ కి చాన్నాళ్ల నుంచి ఉంది. ఇప్పుడు ‘విశ్వంభర‘లో నటించే అవకాశం రావడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడట రావు రమేష్

Related Posts