హ్యాపీ బర్త్ డే మీనాక్షి చౌదరి

సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కథానాయికలు ఒక్కసారిగా డల్ అవ్వొచ్చు. ఏమాత్రం అంచనాలు లేని సినిమాలతో ప్రవేశించినా అనతి కాలంలోనే అగ్రపథానికి దూసుకెళ్లే నాయికలు కొంతమంది ఉంటారు. ఆ రెండో కోవకు చెందిన బ్యూటీయే మీనాక్షి చౌదరి.

మిస్ ఇండియా నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి కి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు‘ తొలి తెలుగు సినిమా. సుశాంత్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ హర్యానా బ్యూటీకి ఆశించిన స్థాయి గుర్తింపును అందించలేకపోయింది. ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడి‘లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మీనాక్షి కి.. అడవి శేష్ ‘హిట్: ది సెకండ్ కేస్‘ మంచి హిట్ ఇచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ చిత్రంతో మురిపించింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం మీనాక్షి సినిమాల స్పీడు మామూలుగా లేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘లక్కీ భాస్కర్‘ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ పీరియడ్ డ్రామాలో సుమతి అనే పాత్రలో కనిపించబోతుంది మీనాక్షి. ఈరోజు (మార్చి 5) మీనాక్షి చౌదరి బర్త్ డే స్పెషల్ గా ‘లక్కీ భాస్కర్‘ నుంచి మీనాక్షి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది టీమ్.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా‘, విశ్వక్ సేన్ సినిమాలలోనూ మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాల నుంచి కూడా మీనాక్షి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ రిలీజయ్యాయి. మరోవైపు కోలీవుడ్ లో ఇలయదళపతి విజయ్ తో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‘ అనే టైటిల్ ఖరారు చేశారు.

Related Posts