పెళ్లి పాటలో విజయ్, మృణాల్ డ్యాన్స్ అదుర్స్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. సమ్మర్ సీజన్లో సందడి చేయబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రెండో గీతం విడుదలైంది. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ అంటూ సాగే ఈ పాటను గోపీసుందర్ కంపోజిషన్ లో అనంత శ్రీరామ్ రాసిన క్యాచీ లిరిక్స్ ను.. మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ.. ముఖ్యంగా వీరిద్దరి డ్యాన్సులు ఆకట్టుకుంటున్నాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5న తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ‘ఫ్యామిలీ స్టార్’ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది

Related Posts