అల్లరోడిని ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ అంటోన్న అమ్మాయి

అల్లరోడు నరేష్ కాస్త గ్యాప్ తర్వాత నటించిన ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది. తెలిసిన వారంతా పెళ్లెప్పుడు? అంటుంటే వారికి సమాధానం చెప్పలేక సతమతమయ్యే పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు.

ఇక.. అతని ఆశలు ఫలించి ఓ అమ్మాయి దగ్గరవుతోంది. తనను ప్రేమిస్తుంది. కానీ.. పెళ్లెప్పుడు అంటే మాత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ అంటోంది. రఘుబాబు, వెన్నెల కిషోర్, వైవా హర్ష వంటి కమెడియన్స్ తో ఫుల్ లెన్త్ ఫన్ రైడ్ లా ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ వేసవి బరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts