షరతులు వర్తిస్తాయి గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్.

షరతులు వర్తిస్తాయి. ఈ టైటిల్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుందీ మూవి. చైతన్య రావు, భూమిశెట్టి జంటగా.. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజ‌ల్లు నిర్మించిన ఈ మూవీ కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 15 న గ్రాండ్ రిలీజ్‌ సందర్భంగా.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రియదర్శి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
సమాజంలో నీ చుట్టూ తెలివైన వారంటున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్పిన మా నాన్న, ఏ పని చేసినా రీతి రివాజు, వాయి వరసలు ఉండాలని చెప్పిన మా అమ్మ, చిన్నూ నువ్వు సినిమాలు తీస్తే నా ట్యూషన్ కు వచ్చే చిన్న పిల్లలు కూడా చూడాలని చెప్పిన నాకు మరో అమ్మ లాంటి భాగ్యవ్వ , సినిమా అంటే పెద్ద మాధ్యమం, కళాత్మకమైంది, వ్యాపారంతో కూడుకున్నది, బాధ్యతతో చేయాల్సిందని నన్ను నమ్మే ఓ వ్యక్తి ..వీళ్లు నలుగురు చెప్పిన మాటలను పాటిస్తూ షరతులు వర్తిస్తాయి సినిమాను రూపొందించానన్నారు డైరెక్టర్‌ కుమారస్వామి. ఈ సినిమాషూటింగ్ కు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా గుర్తు చేసుకుని ధన్యవాదాలు తెలియజేసారాయన.


చైతన్య నాకు మంచి ఫ్రెండ్. కీడా కోలా లాంటి మూవీస్ చేస్తూ సాటి నటుడిగా ఈర్ష్య పడేలా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ప్రయోగాలన్నీ మధ్య తరగతి వారిపైనే జరుగుతుంటాయని, అయితే మంచి ఫలితాలు కూడా మధ్య తరగతి నుంచే వస్తాయి. దానికి న�