ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్‘

ఈ సమ్మర్ సీజన్ లో ఇప్పటివరకూ విడుదలైన చిత్రాలలో అతిపెద్ద విజయాన్ని సాధించింది ‘టిల్లు స్క్వేర్‘. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు‘కి సీక్వెల్ గా రూపొందిన చిత్రమిది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టిల్లు స్క్వేర్‘ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘టిల్లు స్క్వేర్‘ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ‘హిస్టరీ రిపీట్‌ అవ్వడం నార్మల్.. అదే.. టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్‌ అవుతాయ్.. అట్లుంటది టిల్లన్నతోని‘ అని పోస్ట్‌ పెట్టింది.

Related Posts