‘టిల్లు స్క్వేర్‘ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్‘

కంటెంట్ బాగుంటే చాలు సినిమా చిన్నదా? పెద్దదా? అని ఆలోచించరు ఆడియన్స్. తమకు నచ్చిన సినిమాలకు పట్టం కడుతుంటారు. ఈకోవలోనే సితార సంస్థ నుంచి వచ్చిన ‘డీజే టిల్లు‘.. దాని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్‘ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక.. ‘టిల్లు స్క్వేర్‘ భారీ విజయం తర్వాత.. ఇప్పుడు తమ మరో చిన్న చిత్రం ‘మ్యాడ్‘కి సీక్వెల్ తీసుకొస్తోంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ‘మ్యాడ్ స్క్వేర్‘ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అధికారికంగా ముహూర్తాన్ని జరుపుకుంది. ఈ మూవీ ఓపెనింగ్ సెరమనీలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ అనుదీప్ కె.వి. సందడి చేశారు.

‘మ్యాడ్‘ మూవీలో నటించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సీక్వెల్ లోనూ హీరోలుగా నటిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలోనే రూపొందుతోన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

శ్రీకర స్టూడియోస్, ఎస్.నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related Posts