‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ వచ్చేస్తోంది

బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 8న ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

నటసింహం నెవర్ బిఫోర్ అవతార్ లో అదరగొట్టబోతున్న ‘భగవంత్ కేసరి‘ ట్రైలర్ మీ ఊహలకు అందని రీతిలో ఉండబోతుందని మూవీ టీమ్ చెబుతోంది. అలాగే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను వరంగల్ వేదికగా విడుదల చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వెన్యూ పై క్లారిటీ రానుంది.

బాలకృష్ణ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. కూతురు పాత్రలో శ్రీలీల అలరించనుంది. ఇంకా బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ విలన్ గా సందడి చేయబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి‘ విడుదలకాబోతుంది.

Related Posts