టీజర్ తో రాబోతున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన వారిలో సుహాస్ ఒకడు. ‘కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్‘ చిత్రాలతో హీరోగా హిట్స్ అందుకున్న సుహాస్ లేటెస్ట్ గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమాతో సిద్ధమవుతున్నాడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి దుశ్యంత్ కటికినేని దర్శకుడు.

కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించబోతున్నాడు. శివాని నాగరం, శరణ్య ప్రదీప్, జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల తేదీని ఖరారు చేసుకోనుంది. తాజాగా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 9న ఈ చిత్రం టీజర్ విడుదలకాబోతుంది.

Related Posts