ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ మామూలుగా లేదు. ఒకటి తర్వాత ఒకటిగా క్రేజీ మూవీస్ ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ‘దేవర‘ సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్న తారక్ ఆ తర్వాత ‘వార్ 2‘, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నాడు. అయితే.. ‘దేవర‘ సినిమా రెండు భాగాలుగా రూపొందబోతుందనే వార్త రావడంతో ఎన్టీఆర్ లైనప్ లో ఏమైనా ఛేంజ్ వస్తోందా? అని భయపడ్డారు ఫ్యాన్స్. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది వారి ఆందోళనకు కారణం.

లేటెస్ట్ గా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ విషయంలో క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. ఇండియన్ సినిమాలో న్యూ బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా భారీ స్థాయిలో రూపొందే ఈ సినిమాని 2024, ఏప్రిల్ నుంచి మొదలుపెట్టనున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాదు ఈ పోస్ట్ తో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఫోటోకి #NTRNeel అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

‘దేవర‘ షూటింగ్ ప్రోగ్రెస్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే తేదీలపై క్లారిటీ వచ్చేసింది. కానీ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2‘ ఎప్పుడు పట్టాలెక్కబోతుందనే దానిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు.

Related Posts