‘దేవర’ నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. ‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ మే 19న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి ప్రోమో కూడా రిలీజయ్యింది. అనిరుధ్ స్వరకల్పనలో రాబోతున్న ఈ సాంగ్ ఊర మాస్ గా ఉండబోతుందని ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.
అయితే.. ‘దేవర’ నుంచి రాబోతున్న రెండో పాట మాత్రం రొమాంటిక్ మోడ్ లో ఉంటుందట. అందుకే.. ‘దేవర’ మొదటి పాట కోత అయితే.. రెండో పాట లేత అంటూ ఈ సాంగ్స్ పై లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కామెంట్ చేశారు. త్వరలోనే.. ‘దేవర’ నుంచి రెండో పాట కూడా రాబోతుందని.. ప్రస్తుతం అందుకు సంబంధించి పనుల కోసం తాను చెన్నైలో ఉన్నట్టు సోషల్ మీడియాలో తెలిపారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి.