మురళీ మోహన్ మనవరాలితో కీరవాణి కుమారుడు పెళ్లి కన్ఫమ్!

శివశక్తి దత్తా, విజయేంద్రప్రసాద్ వంటి వారు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే.. ఈ అన్నాదమ్ములు సినీ ఇండస్ట్రీలో గట్టి పునాదులు వేస్తే.. వారి తనయులు చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానానికి చేరుకున్నారు. శివశక్తి దత్తా కుమారుడు కీరవాణి సంగీత దర్శకుడిగా, విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి దిగ్దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు.

రాజమౌళి, కీరవాణి లు తమ వారసులను సైతం ఇదే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. అంతేకాదు.. తమకు కాబోయే కోడళ్లను సైతం ఇండస్ట్రీ నుంచే వెతుక్కోవడం విశేషం.

ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం జగపతిబాబు అన్న కుమార్తెతో జరిగింది. ఇప్పుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా వివాహం.. సీనియర్ యాక్టర్ మురళీమోహన్ మనవరాలితో జరగబోతుంది.

తన మనవరాలు రాగ వివాహం కీరవాణి తనయుడితో జరగబోతున్నట్టు తాజాగా క్లారిటీ ఇచ్చారు మురళీమోహన్, ఆయన కోడలు రూప. మురళీ మోహన్ కుమారుడు రామ్మోహన్, రూప దంపతుల ఏకైక కుమార్తె రాగ. తన తాతయ్య నిర్మించిన వ్యాపార సామ్రాజ్యంలో కొన్ని బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగనుందట. కీరవాణి తనయుడు శ్రీసింహా ‘మత్తువదలరా’తో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ‘మత్తువదలరా’ సీక్వెల్ లో నటించబోతున్నాడు శ్రీసింహా

Related Posts