బహు భాషా నటుడు భల్లాలదేవ రానా

రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్లకుండా.. విలక్షణమైన కథలతో అలరించడానికి ఆసక్తి చూపించే కథానాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవాడే దగ్గుబాటి రానా. డిసెంబర్ 13న బాబాయ్ వెంకటేష్ బర్త్ డే అయితే.. డిసెంబర్ 14న అబ్బాయ్ రానా పుట్టినరోజు.

రానా అనగానే మనకు టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన దగ్గుబాటి కుటుంబ వారసత్వం గుర్తుకు వస్తోంది. అయితే.. బాబాయ్ విక్టరీ స్టార్ అయినప్పటికీ ఈ అబ్బాయి కమర్షియల్ ఫార్ములా సినిమాలకు మొదట్నుంచీ దూరంగా ఉంటున్నాడు. అందుకే.. ‘బాహుబలి’ లాంటి సినిమాలో ఎలాంటి సంకోచం లేకుండా విలన్ గా మెప్పించగలిగాడు. తన వద్దకి డిఫరెంట్ స్క్రిప్ట్ తో వస్తే ఖచ్చితంగా అగ్రిమెంట్ సైన్ చేసేస్తాడు మన ఆజానుబాహుడు.

ఒకవైపు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు తమిళం, హిందీ భాషల్లోనూ ప్రాముఖ్యత గల పాత్రల్లో మెరుస్తుంటాడు. బాలీవుడ్ లో ‘బేబి, హౌస్ ఫుల్ 4’ వంటి బడా హిట్స్ రానా ఖాతాలో ఉన్నాయి. తమిళంలోనూ అజిత్ తో ‘ఆరంభం’ వంటి హిట్ అందుకున్న రానా..

ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘వేట్టయాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఓటీటీలో బాబాయ్ తో కలిసి ‘రానా నాయుడు’లో అలరించాడు. ఇక.. తెలుగు విషయానికొస్తే ‘భీమ్లా నాయక్, విరాటపర్వం’ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్’హిరణ్యకశ్యప’ సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజులో తీసుకురావాలనేది రానా ఆలోచన. ఈరోజు రానా బర్త్ డే స్పెషల్ గా న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Related Posts